గిల్ సెంచరీ మిస్, పంత్ అర్ధసెంచరీ
భారత్ 486/4
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా భారీ ఆధిక్యత వైపు దూసుకెళ్తోంది. మూడోరోజు ఆట ముగిసేసరికి భారతజట్టు 118 పరుగుల ఆధిక్యతను సంపాదించింది. కెఎల్ రాహుల్ శతకం... కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తృటిలో సెంచరీ మిస్.. చాలాకాలం తర్వాత టెస్టుల్లో చోటు దక్కించుకున్న రిషబ్ పంత్ వన్డే తరహాలో బ్యాటింగ్.. ఇవీ న్యూజిలాండ్‌తో తొలిటెస్ట్ మూడోరోజు ఆటలో విశేషాలు. ఓవర్‌నైట్ స్కోర్ వికెట్ నష్టానికి 158పరుగులతో శనివారం ఆటను కొనసాగించిన టీమిండియాను కెఎల్ రాహుల్(136), పడిక్కల్(80) ఆదుకున్నారు. వీరిద్దరూ 2వ వికెట్‌కు 135పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత పడిక్కల్ ఔటవ్వగా.. రాహుల్‌తో కలిసి కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (98) ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. వీరిద్దరూ 3వ వికెట్‌కు 89 పరుగులు జతచేశారు. ఆ దశలో కెఎల్ రాలహుల్ ఔటైనా.. గిల్, పంత్ మరో శతక భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియా భారీ స్కోర్‌కు దోహదపడ్డారు.
మూడో రోజు ఆట ముగియడానికి మరో రెండు బంతులే ఉండగా.. డఫీ బౌలింగ్‌లో గిల్ బౌల్డ్ అయ్యాడు. దీంతో గిల్ 2 పరుగుల వ్యవధిలో సెంచరీని మిస్ చేసుకోగా.. రిషభ్ పంత్‌తో కలిసి నాలుగో వికెట్‌కు నిర్మించిన శతక భాగస్వామ్యానికి తెరపడింది. గిల్ కెరీర్‌లో శతకానికి దగ్గర్లో ఔటవ్వడం ఇది 12వ సారి. ఈ క్రమంలో వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ తన 22వ అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో మూడో రోజు ఆట ముగిసేసరికి భారతజట్టు 4 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసింది. క్రీజ్‌లో రిషభ్ పంత్ (55నాటౌట్; 62బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), అన్షుల్ కాంబోజ్(0) క్రీజ్‌లో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 368 పరుగులు చేయగా... టీమిండియాకు ఇప్పటికే 118 పరుగుల ఆధిక్యత లభించింది. ఇక క్రికెట్ చరిత్రలో టీమిండియా ఐదుగురు బ్యాటర్లు విదేశీ గడ్డపై ఒక ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాలు చేయడం 94 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.
స్కోర్‌బోర్డు...
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 368ఆలౌట్
ఇండియా తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి)బ్లండెల్ (బి)హెన్రీ 85, కెఎల్ రాహుల్ (బి)స్మిత్ 136, పడిక్కల్ (బి)జేమీసన్ 80, గిల్ (బి)డఫీ 98, పంత్ (బ్యాటింగ్) 55, కంబోజ్ (బ్యాటింగ్) 0, అదనం 22. (125ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి) 486పరుగులు.
వికెట్ల పతనం: 1/130, 2/295, 3/386, 4/486
బౌలింగ్: హెన్రీ 29-7-86-1, జేమీసన్ 27-6-57-1, డఫీ 29-1-180-1, స్మిత్ 24-0-65-1, ఫిలిప్స్ 14-0-76-0, రచిన్ రవీంద్ర 2-0-6-0.






కామెంట్‌లు (0)