నవతెలంగాణ - హైదరాబాద్ : నాలుగేళ్ల విరామం తర్వాత భారత టీ20 జట్టులోకి పునరాగమనం చేసిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌పై న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ ప్రశంసలు కురిపించాడు. కొత్త బంతితో భువీ అత్యంత ప్రమాదకరమని, స్వింగ్‌ను అద్భుతంగా రాబట్టగలడని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ పరిస్థితులు భువనేశ్వర్‌కు అనుకూలిస్తాయని, పచ్చిక ఉన్న పిచ్‌లపై అతడిని ఎదుర్కోవడం తమకు సవాల్‌గా మారుతుందని శాంట్నర్ అభిప్రాయపడ్డాడు. ఫ్లాట్ పిచ్‌లపై భారత జట్టును ఆపడం కష్టమని, పరిస్థితులకు త్వరగా అలవాటు పడిన జట్టే సిరీస్‌లో విజయం సాధిస్తుందని తెలిపాడు.
భువనేశ్వర్‌తో మాకు పెను సవాల్: శాంట్నర్
5 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)