Magazines

కంటి వైద్య శిబిరం ప్రారంభించిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

1 గంట క్రితం

eye camp
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 21, 2026 | 1 నిమిషాల చదవడం


-లయన్స్ క్లబ్ కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

- 200మందికి కంటి పరీక్షలు..

- 30మందికి శస్త్రచికిత్సలు

-అధ్యక్షుడు లక్కినేని


నవతెలంగాణ -అశ్వారావుపేట


లయన్స్ క్లబ్ అశ్వారావుపేట మండల విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.శిబిరంలో సుమారు 200మందికి కంటి పరీక్షలు నిర్వహించి,అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.వీరిలో సుమారు 30మందికి శస్త్రచికిత్సలు అవసరమని వైద్య బృందం నిర్ధారించింది.వీరికి ఈ నెల 24న వైరాలోని కంటి ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

mla-jare-adinarayana

స్థానిక టీవీఎస్ షోరూం,ఆదిత్య చిన్నపిల్లల ఆసుపత్రి సహకారంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే,లయన్ జారె ఆదినారాయణ,మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు హాజరయ్యారు.కంటి వైద్య నిపుణులు కాప మురళీకృష్ణ,డాక్టర్ రవిచంద్ర తమ వైద్య బృందంతో కలిసి పరీక్షలు నిర్వహించారు.శిబిరానికి వచ్చిన వారికి భోజన వసతి కూడా కల్పించారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్