హైదరాబాద్ : ఈ నెల 7 నుంచి మాస్టర్స్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ (ఎంసీఏహెచ్) ఆధ్వర్యంలో మాస్టర్స్ సూపర్ లీగ్ (ఎంఎస్‌ఎల్) ఆరంభం కానుంది. లీగ్‌లో కేఎల్‌ఆర్ ట్రాన్స్‌ఫార్మర్స్, మా స్పేసెస్, రేజింగ్ బుల్స్, జూపర్ ఎల్‌ఈడీ బుల్లెట్స్, సన్‌క్రెస్ట్ వారియర్స్, టెర్మినస్, రీట్ మేవరిక్స్ జట్లు పోటీపడనున్నాయి. అనివార్య కారణాలతో క్రికెట్‌ను వదిలేసిన వెటరన్స్ కోసమే లీగ్ నిర్వహిస్తున్నామని ఎంసీఏహెచ్ అధ్యక్షుడు ఎస్పీ రెడ్డి తెలిపారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో సినీ నటులు అలీ, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, హెచ్‌సీఏ సంయుక్త కార్యదర్శి బసవరాజు, టీజీ20 చైర్మెన్ ఆగంరావు తదితరులు లీగ్ ట్రోఫీని ఆవిష్కరించారు. అక్టోబరు 11న ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.






కామెంట్‌లు (0)