Magazines

విద్యుత్ వినియోగదారులపై రూ.5420 కోట్ల భారం

1 గంట క్రితం

electricity consumers
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 2 నిమిషాల చదవడం

ట్రూ-అప్ చార్జీల వసూలుకు ఈఆర్‌‌సీ ఆనుమతి
నవంబర్‌ ‌నుంచి బిల్లుల్లో బాదుడు షురూ


నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ర్టంలోని విద్యుత్‌ వినియోగదారుల పై ట్రూ-అప్ చార్జీల భారం పడనుంది. 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించి వినియోగదారుల నుంచి రూ.5,420 కోట్ల ట్రూ అప్ చార్జీల వసూలు కు విద్యుత్‌ ‌నియంత్రణ మండలి(ఈఆర్‌‌సీ) అనుమతించింది. నవంబర్ నెల నుండి ప్రతీ యూనిట్ కు 30 పైసలు, డిసెంబర్ నుండి ప్రతీ యూనిట్ కు 50 పైసలు వసూలు చేసుకోవచ్చంటూ సోమవారం ఈఆర్‌సీ చైర్మెన్‌ ‌జస్టిస్‌ ‌దేవరాజు నాగార్జున ఉత్తర్వులు జారీ చేశారు. దక్ష‍ిణ ప్రాంత విద్యుత్‌ ‌పంపిణీ సంస్థ (ఎస్పీడీసీఎల్‌) 29 నెలలు, ఉత్తర ప్రాంత విద్యుత్‌ ‌పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌) 26 నెలలు వసూలు చేసుకోవచ్చని పేర్కొంది. మొత్తం రూ. 7,635.22 కోట్ల ట్రూ-అప్ చార్జీలకు అనుమతించినప్పటికీ ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ. 2,214.99 కోట్లను రాష్ర్ట ప్రభుత్వం నుంచి వసూలు చేసుకోవాలని ఈఆర్‌‌సీ సూచించింది. ఇందులో ఎస్పీడీసీఎల్‌కు రూ.1,442.49 కోట్లు, ఎన్పీడీసీఎల్‌‌కు రూ. 772.50 కోట్ల వాటా ఉంది. అలాగే వినియోగ దారుల నుంచి వసూలు చేయనున్న రూ. 5,420.23 కోట్ల మొత్తంలో ఎస్పీడీసీఎల్‌‌కు రూ. 4,222.93 కోట్లు, ఎన్పీడీసీఎల్‌కు రూ. 1,197.30 కోట్ల వాటా ఉందని ఈఆర్‌‌సీ పేర్కొంది. రెండు డిస్క్ంలు తమకు నిర్దేశించిన కాలంలో 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో వినియోగించిన విద్యుత్ ఆధారంగా (వ్యవసాయ కనెక్షన్లను మినహాయించి) అర్హత కలిగిన సర్వీస్ కనెక్షన్ల


నుంచి మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది. ట్రూ-అప్‌ అంటే?
ప్రతి సంవత్సరం తాము ఎంత విద్యుత్ కొనుగోలు చేయబోతున్నాం, దానికి ఎంత ఖర్చవుతుందో ఒక అంచనా వేసి విద్యుత్ నియంత్రణ మండలి(ఈఆర్‌‌సీ) కి డిస్కంలు ప్రతీ ఏటా సమర్పిస్తాయి. వాటి ఆధారంగా నెలవారీ కరెంట్ బిల్లుల టారిఫ్‌‌ను ఈఆర్‌‌సీ నిర్ణయిస్తుంది. డిస్కంల నిర్వహణ, ఇతర వ్యయాలు అధికమయినప్పుడు తాము ఈఆర్‌సీకి ఇచ్చిన అంచనా కంటే ఖర్చులు పెరుగుతాయి. వాటిని భర్తీ చేసుకునే ప్రక్రియనే ట్రూ-అప్‌ చార్జీలుగా పిలుస్తారు. ఈ అదనపు భారాన్ని ఒకేసారి కాకుండా ఈఆర్‌ఎసీ నిర్ణయించిన వ్యవధిలో ప్రతి నెలా బిల్లులో విడిగా కలుపుతారు. వాడిన ప్రతి యూనిట్‌కు ఇన్ని పైసలు అంటూ అదనంగా బిల్లు వస్తుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్