Magazines

ఏసీబీ వలలో టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌

59 నిమిషాల క్రితం

acb
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 06, 2026 | 1 నిమిషాల చదవడం

రూ.4 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత

భవన నిర్మాణంలో నిబంధనల ఉల్లంఘనకు లంచం డిమాండ్‌


నవతెలంగాణ- మెహిదీపట్నం ​
జీహెచ్‌ఎంసీ మెహిదీపట్నం టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ టి. సునీత రూ.4 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఖైరతాబాద్‌ జోనల్‌ కార్యాలయం ఎదురుగా లంచం తీసుకుని తన కారులో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఓ భవన నిర్మాణానికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘనలపై జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేసినప్పటికీ, వాటిని పక్కనపెట్టి నిర్మాణాన్ని కొనసాగించేందుకు అనుమతించేలా నిర్మాణదారుడి నుంచి సూపర్‌వైజర్‌ రూ.8 లక్షలు లంచం డిమాండ్‌ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇందులో తొలి విడతగా రూ.4 లక్షలు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. దాంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో పక్కా ప్రణాళికతో వల పన్ని ఆమెను పట్టుకున్నారు. లంచం మొత్తంతో పాటు ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో సునీత వద్ద లెక్కల్లో చూపని మరో రూ.2.50 లక్షలను కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా రూ.6.50 లక్షలు స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్టు చేశారు. అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు తరలించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్