Magazines

ఇక్కడైనా మెరుస్తారా?

44 నిమిషాల క్రితం

shine
avatar
balaji

ప్రచురించబడింది అక్టో 05, 2026 | 1 నిమిషాల చదవడం

బరిలో సింధు, శ్రీకాంత్‌, ప్రణయ్‌
నేటి నుంచి ఆర్కిటిక్‌ ఓపెన్‌ సూపర్‌ 500


వాంటా (ఫిన్లాండ్‌) : ఆసియా క్రీడల్లో నిరాశపరిచిన భారత షట్లర్లు.. మళ్లీ బిడ్ల్యూఎఫ్‌ ‌టైటిల్ వేటకు సిద్దమవుతున్నారు. ఆసియా క్రీడల్లో భారత పురుషుల జట్టు కాంస్య పతకం సాధించగా.. మహిళల జట్టుతో పాటు వ్యక్తిగత విభాగాల్లో పతకాలు రాలేదు. పి.వి సింధు సహా మరో నలుగురు క్వార్టర్స్‌‌కు చేరినా, పతకానికి అడుగు దూరంలో నిలిచిపోయారు. నేటి నుంచి ఆర్కిటిక్‌ ఓపెన్‌ ‌సూపర్‌ 500 ‌టోర్నమెంట్‌ ఆరంభం కానుండగా భారత షట్లర్లు పి.వి సింధు, హెచ్‌.ఎస్‌ ‌ప్రణయ్‌, కిదాంబి శ్రీకాంత్‌ ‌బరిలోకి దిగుతున్నారు. పి.వి సింధు ఆసియా క్రీడల్లో మెడల్‌ ‌కొట్టలేదు. కానీ గేమ్‌ ‌పరంగా సింధు మంచి ఫామ్‌‌లో ఉంది. అగ్రశ్రేణి షట్లర్లను దీటుగా ఎదుర్కొంటుంది. సింధుతో పాటు తన్వీ శర్మ, అష్మిత చాలిహ, ఇషారాణి సైతం మహిళల సింగిల్స్‌‌ బరిలో నిలిచారు. హెచ్‌.ఎస్‌ ‌ప్రణయ్‌, కిదాంబి శ్రీకాంత్‌‌లు కాంస్యం నెగ్గిన జట్టులో సభ్యులే కానీ, ఈ ఇద్దరూ ఒక్క మ్యాచ్‌‌లోనూ బరిలోకి దిగలేదు. పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తున్న వెటరన్‌ ‌షట్లర్లు పురుషుల సింగిల్స్‌‌లో అదృష్టం పరీక్షించుకోనున్నారు. పురుషుల డబుల్స్‌‌లో హరిహరణ్‌, ఎంఆర్‌ అర్జున్‌ ‌జోడీ, కృష్ణ ప్రసాద్‌, పృథ్వీ జోడీ బరిలోకి దిగుతున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్