Magazines

ఎంఎస్‌ఎల్‌ ‌విజేత రేజింగ్‌ ‌బుల్స్‌

1 గంట క్రితం

MSL winner Raging Bulls
avatar
Rajabapu Odela

ప్రచురించబడింది అక్టో 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : మాస్టర్స్‌ సూపర్‌ ‌లీగ్‌ (ఎంఎస్‌ఎల్‌) ‌విజేతగా రేజింగ్‌ ‌బుల్స్‌ ‌నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో సన్‌‌క్రెస్ట్‌ ‌వారియర్స్‌‌పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. వారియర్స్‌ 157/6 ‌పరుగులు చేయగా, బుల్స్‌ 19.2 ఓవర్లలోనే 158/7 పరుగులు చేసింది. ‘ఎంఎస్‌ఎల్‌‌కు మంచి ఆదరణ లభించింది. ఇక ఏడాదికి రెండు సీజన్లు నిర్వహిస్తాం. వచ్చే సీజన్‌‌కు ఆటగాళ్లను వేలంలో తీసుకునేలా చేస్తామని’ మాస్టర్స్‌ ‌క్రికెట్‌ అసోసియేషన్‌ అఫ్‌ ‌హైదరాబాద్‌ అధ్యక్షుడు ఎస్పీ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టోర్నమెంట్‌ ‌నిర్వహించారు. క్రికెట్‌‌తో వెటరన్ల అనుబంధం కొనసాగేందుకు ఈ లీగ్‌ ‌వేదికగా నిలిచింది. ఎంఎస్‌ఎల్‌‌ను సౌత్‌ జోన్‌, పాన్‌ ఇండియా స్థాయికి విస్తరించేందుకు కృషి చేస్తామని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ముగింపు వేడుకల్లో ఉపేందర్‌ ‌రెడ్డి, సునీల్‌ ‌రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్