బరిలో 80 మంది వైద్య క్రీడాకారులు
హైదరాబాద్: డాక్టర్స్ ఇండియన్ పికిల్‌బాల్ లీగ్ (డిఐపిఎల్) శనివారం అట్టహాసంగా ప్రారంభమైంది. హైదరాబాద్ లోని క్రాస్‌కోర్ట్స్ కాంప్లెక్స్ లో వేదికగా జరుగుతున్న ఈ టోర్నమెంట్ లో 11 జట్లు పాల్గొంటున్నాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ దశ మ్యాచులు జరుగుతాయి. లీగ్ దశలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన నాలుగు జట్లు ప్లేఆఫ్స్ అర్హత సాధిస్తాయి. డిసెంబర్ 19న ఫైనల్స్ జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్స్ ఇండియన్ పికిల్‌బాల్ లీగ్ ఫౌండర్ డాక్టర్ రవి ఆండ్రూస్ మాట్లాడుతూ ..’ భారత్ లో సగటు వ్యక్తి జీవన కాలం కంటే వైద్యుల జీవన కాలం తక్కువగా ఉంది. వైద్యులు పని ఒత్తిడిలో ఆరోగ్యం నిర్లక్ష్యం చేయకుండా ఉండేందుకు పికిల్ బాల్ లీగ్ ఎంతో ఉపకరిస్తుంది. తొలి సీజన్ కి మంచి స్పందన వచ్చింది. ఈ సీజన్ లో 80 మంది డాక్టర్స్ ఆడుతున్నారు. తొలిసారి జెండర్ న్యూట్రల్ ఫార్మాట్ లో నిర్వహిస్తున్న లీగ్ ఇది. విజేతకు రూ. 4 లక్షలు, రన్నరప్ కి రూ. 2 లక్షల ప్రైజ్ మనీ అందుతున్నామని ‘ తెలిపారు. కార్యక్రమంలో క్రాస్ కోర్ట్స్ కో ఫౌండర్ గౌతమ్ వింజమూరి, లూసిడ్ డయాగ్నోస్టిక్స్ డైరెక్టర్ మేఘన రెడ్డి, వంశీరాం బిల్డర్స్ డైరెక్టర్ భరత్, విటా కాంక్లేవ్ ప్రతినిధులు డాక్టర్ మునా, అనికేత్ తదితరులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)