హైదరాబాద్ : రాష్ర్ట స్థాయి రగ్బీ చాంపియన్‌షిప్ పోటీలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. సంగారెడ్డిలోని వోక్సెన్ యూనివర్శిటీలో నిర్వహించిన ఈ పోటీల్లో అండర్-15 బాలికల విభాగంలో ఖమ్మం జట్టు విజేతగా నిలిచింది. బాలికల అండర్-18 విభాగంలో మెదక్ జట్టు చాంపియన్‌గా నిలిచింది. అండర్-15 ఫైనల్లో 15-0తో నల్గొండపై ఖమ్మం జయకేతనం ఎగురవేయగా, కాంస్య పతక పోరులో వనపర్తి 10-0తో మెదక్‌పై గెలుపొందింది. అండర్-18 ఫైనల్లో నల్గొండపై 15-5తో మెదక్ పైచేయి సాధించింది. కాంస్య పతక మ్యాచ్‌లో ఖమ్మం 25-0తో కరీంనగర్‌పై గెలుపొందింది. తెలంగాణ రగ్బీ అసోసియేషన్ అధ్యక్షుడు నరేంద్ర రామ్, ప్రధాన కార్యదర్శి ఆదిత్య, వోక్సెన్ యూనివర్శిటీ స్పోర్ట్స్ హెడ్ విశాల్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.





కామెంట్‌లు (0)