Magazines

వరుణుడు కరుణించేనా?

13 నిమిషాల క్రితం

merciful
avatar
balaji

ప్రచురించబడింది నవం 06, 2026 | 2 నిమిషాల చదవడం

భారత్‌, న్యూజిలాండ్‌ రెండో వన్డే నేడు
మ్యాచ్‌‌కు రోజంతా వర్షం సూచనలు

ఉదయం 7.30 నుంచి సోనీ నెట్‌‌వర్క్‌‌లో..


వెల్లింగ్టన్‌ (‌న్యూజిలాండ్‌)

భారత్‌, న్యూజిలాండ్‌ ‌రెండో వన్డేకు సిద్ధమవుతుండగా.. వరుణుడు మరోసారి స్టేడియంలో అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నాడు. ఆక్లాండ్‌‌లో వర్షం కారణంగా తొలి వన్డే డక్‌‌వర్త్‌ ‌లూయిస్‌ ‌పద్దతిలో తేలిన సంగతి తెలిసిందే. భారత్‌ ఇన్నింగ్స్‌‌కు వర్షం ఆటంకం కలిగించగా, లక్ష్యాన్ని సవరించారు. వన్డే సిరీస్‌‌లో రెండో మ్యాచ్‌ ‌శనివారం వెల్లింగ్టన్‌‌లో జరుగనుంది. అయితే, ఈ మ్యాచ్‌‌కు సైతం వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. శనివారం మధ్యాహ్నాం వరకు 60 శాతం వర్షం పడే పరిస్థితులు ఉండనుండగా.. ఆ తర్వాత వర్షం పడే అవకాశాలు 55 శాతం మేరకు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

​ప్రాక్టీస్‌ ‌రద్దు

ఆక్లాండ్‌‌లో వర్షం ప్రభావిత మ్యాచ్‌‌లో విజయం సాధించిన టీమ్‌ ఇండియా.. వెల్లింగ్టన్‌‌లో అసలు ప్రాక్టీస్‌‌కు రాలేదు. వెల్లింగ్టన్‌‌లో నిలకడగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. భారత్‌ ‌ప్రాక్టీస్‌ ‌సెషన్‌‌కు బేసిన్‌ ‌రిజర్వ్‌ ‌గ్రౌండ్‌‌కు ఎంచుకుంది. వర్షం కారణంగా ప్రాక్టీస్‌ ‌సెషన్‌‌ను రద్దు చేసుకుని, ఆటగాళ్లు హోటల్‌ ‌రూమ్‌‌లకే పరిమితం అయ్యారు. న్యూజిలాండ్‌ ‌క్రికెట్‌ ‌జట్టు వెల్లింగ్టన్‌ ‌కాలేజ్‌ ‌ప్రాంగణంలోని ఇండోర్‌ ‌నెట్స్‌‌లో సాధన చేసింది.

​జోరు సాగేనా?

తొలి వన్డేలో విరాట్‌ ‌కోహ్లి అదరగొట్టాడు. భారీ అర్థ సెంచరీతో భారత్‌‌ను గెలుపు తీరాలకు చేర్చాడు. కెప్టెన్‌ ‌శుభ్‌‌మన్‌ ‌గిల్‌, ఓపెనర్‌ ‌రోహిత్‌ ‌శర్మ సైతం భారీ స్కోరు సాధించాలని చూస్తున్నారు. శ్రేయస్‌ అయ్యర్‌ ‌మిడిల్‌ ఆర్డర్‌‌లో తనదైన ముద్ర చూపించాలని తపిస్తున్నాడు. టీ20ల్లో మిశ్రమ గణాంకాలు నమోదు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ ‌వన్డేల్లో తనేంటో నిరూపించుకోవాల్సి ఉంది. కెఎల్‌ ‌రాహుల్‌, నమన్‌ ‌ధీర్‌ ‌సైతం అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. పేసర్‌ మహ్మద్‌ ‌సిరాజ్‌ ఈ మ్యాచ్‌‌లో బరిలోకి దిగనున్నాడు. అకిబ్‌ ‌నబికి సైతం అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి.

​కివీస్‌‌కు గాయాల బెడద

న్యూజిలాండ్‌కు గాయాల దెబ్బ గట్టిగానే తగిలింది. ఇప్పటికే తొలి ప్రాధాన్య క్రికెటర్లు వన్డే జట్టుకు దూరం కాగా.. తాజాగా కంకషన్‌‌తో డెవాన్‌ ‌కాన్వే అందుబాటులో ఉండటం లేదు. ఆక్లాండ్‌ ‌వన్డే ముందు ప్రాక్టీస్‌ ‌సెషన్లో డెవాన్‌ ‌కాన్వే గాయపడ్డాడు. అతడి స్థానంలో నిక్‌ ‌కెల్లీని జట్టులోకి ఎంపిక చేశారు. డార్లీ మిచెల్‌, గ్లెన్ ఫిలిప్స్‌, మైకల్‌ ‌బ్రాస్‌‌వెల్‌ , టామ్‌ ‌లేథమ్‌‌లు కివీస్‌‌కు కీలకం కానున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్