Magazines

​బరిలో బుమ్రా, జడేజా

16 నిమిషాల క్రితం

Bumrah
avatar
balaji

ప్రచురించబడింది నవం 06, 2026 | 1 నిమిషాల చదవడం

నేటి నుంచి మూడో అనధికార టెస్టు

లింకన్‌ (‌న్యూజిలాండ్‌) : భారత్‌, న్యూజిలాండ్‌ ‌టెస్టు సిరీస్‌ ‌ముందు పేస్‌ ‌దళపతి జశ్‌‌ప్రీత్‌ ‌బుమ్రా, స్పిన్‌ ‌మాయగాడు రవీంద్ర జడేజా కివీస్‌ ‌పరిస్థితుల్లో రెడ్‌‌బాల్‌ ‌ఫార్మాట్లో సాధన చేయనున్నారు. భారత్‌, న్యూజిలాండ్‌ ‌తొలి టెస్టు ఈ నెల 19 నుంచి ఆరంభం కానుండగా.. నేటి నుంచి భారత్‌-ఏ, న్యూజిలాండ్‌-ఏ జట్ల మూడో అనధికార టెస్టు మ్యాచ్‌ ‌షురూ కానుంది. ఇటీవల బెంగళూరులోని సీవోఈలో ఫిట్‌‌నెస్‌ ‌పరీక్షలు పాసైన సీనియర్‌ ‌క్రికెటర్లు న్యూజిలాండ్‌‌కు చేరుకుని ప్రాక్టీస్‌ ‌ప్రారంభించారు. ధ్రువ్‌ ‌జురెల్‌ ‌నాయకత్వంలో భారత్‌-ఏ ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. యశస్వి జైస్వాల్‌, దేవదత్‌ ‌పడిక్కల్, సాయి సుదర్శన్‌ ‌సైతం ఈ మ్యాచ్‌‌లో ఆడనున్నారు. వికెట్‌ ‌కీపర్‌ ‌బ్యాటర్‌ ‌రిషబ్‌ ‌పంత్‌ ‌ఫిట్‌‌నెస్‌ ‌సమస్యలతో భారత్‌-ఏ మ్యాచ్‌‌కు దూరమైన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్