సముద్రంలో కొట్టుకుపోయిన ఏడుగురు తెలంగాణ విద్యార్థులు.. ఒకరు గల్లంతు

1 గంట క్రితం

Seven Telangana students washed away in the sea.. one missing
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : విహారయాత్ర కోసం పుదుచ్చేరి వెళ్లిన తెలంగాణ విద్యార్థులకు సముద్రంలో ప్రమాదం ఎదురైంది. సముద్ర స్నానానికి దిగిన మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఏడుగురు విద్యార్థులు అలల ఉధృతికి చిక్కుకోగా, స్థానిక లైఫ్‌ గార్డ్స్‌ అప్రమత్తమై ఆరుగురిని రక్షించారు. మరో విద్యార్థి గల్లంతయ్యాడు. ఘటనను గమనించిన లైఫ్‌ గార్డ్స్‌ వెంటనే సహాయక చర్యలు చేపట్టి ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారికి ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. గల్లంతైన విద్యార్థి ఆచూకీ కోసం కోస్ట్‌ గార్డ్‌, మెరైన్‌ పోలీసులు, లైఫ్‌ గార్డ్స్‌ కలిసి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్