2009 నవంబర్‌ 29 తెలంగాణ ఉద్యమంలో మైలురాయి: కేటీఆర్‌

36 నిమిషాల క్రితం

November 29 is a milestone in the Telangana movement: KTR
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ సమయంలో 2009 నవంబర్‌ 29న కేసీఆర్‌ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమంలో కీలక మైలురాయిగా నిలిచిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి కేసీఆర్‌ చేసిన పోరాటం దేశ రాజకీయాలను మలుపు తిప్పిందని కొనియాడారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందిస్తూ.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్‌ సచ్చుడో’ అనే నినాదంతో చేపట్టిన దీక్ష కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించిందన్నారు. నవంబర్‌ 29 లేకుంటే డిసెంబర్‌ 9 లేదని, డిసెంబర్‌ 9 లేకుంటే జూన్‌ 2 లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం, అస్తిత్వం, ఆత్మగౌరవానికి గుర్తింపు తీసుకొచ్చిన కేసీఆర్‌ పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో కరీంనగర్‌ జిల్లా అలుగునూరు చౌరస్తా వద్ద నేడు బీఆర్‌ఎస్‌ దీక్షా దివస్‌ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు కేటీఆర్‌ హాజరుకానున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్