నవతెలంగాణ - హైదరాబాద్ : గత కొన్ని నెలలుగా పెరుగుతూ వచ్చిన బియ్యం ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నాయి. సన్న బియ్యం రకాలను బట్టి ఇటీవల కిలోకు రూ.80 వరకు ధర పెరగగా, రాష్ట్ర ప్రభుత్వం చర్యలతో ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. మార్కెట్లోకి ప్రభుత్వ నిల్వలను విడుదల చేయడం, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు చేపట్టడంతో ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం బీపీట్, కర్నూల్ సోన మైసుర్ రకాలు కిలో రూ.66కు, తెలంగాణ సోనా, RNR రకాలు రూ.74కు, HMT, JSR రకాలు రూ.79కు లభిస్తున్నాయి. అటు కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో దేశవ్యాప్తంగా ధరలు తగ్గినట్లు తెలుస్తోంది. కొత్త ధాన్యం మార్కెట్లోకి రావడంతో రానున్న రోజుల్లో బియ్యం ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.
దిగొస్తున్న బియ్యం ధరలు.. కిలోకు రూ.79కే సన్న బియ్యం!
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)