ఘట్‌కేసర్‌లో మహిళ నుంచి రూ.40 వేల నగదు అపహరణ

34 నిమిషాల క్రితం

Rs. 40 thousand in cash stolen from woman in Ghatkesar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ -హైదరాబాద్ : మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఉదయం నగదు అపహరణ ఘటన చోటుచేసుకుంది. ఈడబ్ల్యూఎస్‌ కాలనీకి చెందిన బైరోజు శైలజ (32), సన్‌షైన్‌ పార్క్‌ కాలనీ నుంచి రూ.40 వేల నగదుతో బయటకు వస్తుండగా పల్సర్‌ బైక్‌పై వచ్చిన ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె చేతిలోని డబ్బును లాక్కొని పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల ఆచూకీ కోసం స్థానిక సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్