ఇండియా కూటమి నేతలతో కలిసి చెన్నై వెళ్తున్న రాహుల్ గాంధీ

12 నిమిషాల క్రితం

ఇండియా కూటమి నేతలతో కలిసి చెన్నై వెళ్తున్న రాహుల్ గాంధీ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని డీఎంకే అధినేత స్టాలిన్‌ను కోరేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ చెన్నై వెళ్లారు. స్టాలిన్‌తో భేటీ అయి బిల్లుపై తమ అభ్యంతరాలను వివరించనున్నారు. దేశ, తమిళనాడు ప్రయోజనాల కోసం బిల్లును ఓడించాలని రాహుల్ గాంధీ ఎక్స్‌ వేదికగా స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు.

అయితే, కాంగ్రెస్ విజ్ఞప్తికి ముందే డీఎంకే బిల్లుకు మద్దతు ప్రకటించింది. స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఎంపీల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. తమ ప్రధాన డిమాండ్లను బిల్లులో చేర్చారని, ఇది దక్షిణాది రాష్ట్రాలకు విజయమని స్టాలిన్ పేర్కొన్నారు. లోక్‌సభ సీట్ల పెంపు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై ప్రతిపాదనల నేపథ్యంలో ఈ అంశం రాజకీయంగా కీలకంగా మారింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్