కివీస్-ఏతో భారత్- ఏ మూడో అనధికార టెస్టు
లింకన్ (న్యూజిలాండ్) : యశస్వి జైస్వాల్ (102, 138 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్లు సాయి సుదర్శన్ (77 నాటౌట్, 205 బంతుల్లో 10 ఫోర్లు), యశస్వి జైస్వాల్ తొలి వికెట్‌కు 175 పరుగుల భారీ ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్ కివీస్-ఏ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 16 ఫోర్లు, 2 సిక్సర్లతో దండెత్తాడు. సెంచరీ అనంతరం వికెట్ కోల్పోయినా.. భారత్-ఏ జోరు తగ్గలేదు. ఓపెనర్ సాయి సుదర్శన్ అజేయ అర్థ సెంచరీతో క్రీజులో నిలువగా.. కెప్టెన్ ధ్రువ్ జురెల్ (12 నాటౌట్, 24 బంతుల్లో 2 ఫోర్లు) అజేయంగా ఆడుతున్నాడు. దేవదత్ పడిక్కల్ (15) నిరాశపరిచాడు. తొలి రోజు ఆటలో భారత్-ఏ 69.3 ఓవర్లలో 2 వికెట్లకు 227 పరుగులు చేసింది.







కామెంట్‌లు (0)