- Advertisement -
బెంగళూరు : దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ లిమిటెడ్ వాహన ఉత్పత్తిలో నూతన మైలురాయిని చేరినట్లు ప్రకటించింది. తమిళనాడులోని హోసూర్‌లో ఉన్న తమ తయారీ ప్లాంట్ నుండి 5 లక్షల వాహనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. 5,00,000 స్కూటర్లను అధిగమించడం ఏథర్‌కు ఒక ప్రధాన మైలురాయి అని ఆ కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీటీఓ స్వప్నిల్ జైన్ పేర్కొన్నారు. ‘మా మొట్టమొదటి ప్రోటోటైప్ నుండి నేటి వరకు, మా ప్రయాణం కేవలం వాహనాలను నిర్మించడం మాత్రమే కాదు, స్కేలబుల్, నమ్మకమైన, స్థిరమైన తయారీ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారించింది” అని జైన్ తెలిపారు.
- Advertisement -