Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల ప్రత్యేక అధికారిగా ఆత్మ పిడి తిరుమల ప్రసాద్

మండల ప్రత్యేక అధికారిగా ఆత్మ పిడి తిరుమల ప్రసాద్

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల ప్రత్యేక అధికారిగా ఆత్మ పిడి ఆర్.తిరుమల ప్రసాద్ మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటివరకు మండల ప్రత్యేక అధికారిగా కొనసాగిన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయ గౌడ్ డిచ్ పల్లి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఆత్మ పిడి ఆర్.తిరుమల ప్రసాద్ నూతనంగా మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలను స్వీకరించారు. మండల ప్రత్యేక అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన ఆత్మ పిడి తిరుమల ప్రసాద్ ను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, మండల స్థాయి అధికారులు శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -