బాలికపై సామూహిక అఘాయిత్యం
ఐదుగురు ఉపాధ్యాయుల అరెస్టు
భువనేశ్వర్: బీజేపీ పాలిత ఒడిశాలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులే 13 ఏండ్ల చిన్నారిపై పదేపదే అఘాయిత్యానికి పాల్పడ్డారు. పోలీసులు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని కేంద్రపారా జిల్లాలో ఒక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై సదరు పాఠశాలలోని ఉపాధ్యాయులే చాలాకాలంగా లైంగికంగా వేధించారు. ఈ విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఈ నెల 19న వారు స్థానిక చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ఆశ్రయించారు.
ఆ కమిటీ ప్రాథమికంగా దర్యాప్తు చేసింది. అనంతరం ఈ దారుణ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు జరపాలని పోలీసులు, జిల్లా విద్యాశాఖ అధికారిని కమిటీ ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి.. ఐదుగురు టీచర్లను అరెస్ట్ చేశారు. బాధిత బాలిక స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. వైద్య పరీక్షల తర్వాత లైంగిక దాడిపై కేసు నమోదు చేశారు. నిందితులైన ఐదుగురు టీచర్లను అరెస్ట్ చేసినట్టు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.
ఒడిశాలో దారుణం
- Advertisement -
- Advertisement -



