Friday, November 14, 2025
E-PAPER
Homeజాతీయంవిజయవాడలో దారుణం

విజయవాడలో దారుణం

- Advertisement -

పట్టపగలే నడిరోడ్డుపై భార్యను హత్య చేసిన భర్త
విజయవాడ : విజయవాడ నగరంలో పట్టపగలే నడిరోడ్డుపై భార్యను భర్త కిరాతకంగా హత్య చేశాడు. స్థానికుల కథనం ప్రకారం… విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పనిచేస్తున్న సరస్వతి (25), భవానీపురంలోని శ్రేయాస్‌ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న విజయ్ 2022 ఫిబ్రవరి 14న ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ప్రస్తుతం రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. అనుమానంతో భార్యతో భర్త తరచూ గొడవపడుతుండేవాడు. దీంతో, గత కొంతకాలంగా కుమారుడితో కలిసి సరస్వతి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెపై భర్త కక్ష పెంచుకున్నాడు. విన్స్‌ ప్రైవేటు ఆస్పత్రిలో విధులు ముగించుకుని గురువారం ఇంటికి వెళ్తున్న సరస్వతిని విజయవాడలోని స్వాతి ప్రెస్‌ సమీపంలో మెడపై పొడిచి, గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడిని సూర్యారావుపేట పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -