నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీలంకలో పట్టపగలే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రతిపక్ష పార్టీకి చెందిన రాజకీయ నాయకుడిని ఆయన కార్యాలయంలోనే ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే, వెలిగమ నగర కౌన్సిల్ చైర్మన్, ప్రతిపక్ష సమగి జన బలవేగయ (SJB) పార్టీకి చెందిన లసంత విక్రమశేఖర (38) ఈరోజు తన కార్యాలయంలో ప్రజలతో సమావేశమయ్యారు. అదే సమయంలో లోపలికి దూసుకొచ్చిన ఓ ఆగంతకుడు రివాల్వర్‌తో ఆయనపై పలుమార్లు కాల్పులు జరిపాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విక్రమశేఖర అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాడి సమయంలో కార్యాలయంలో ఇతరులు ఉన్నప్పటికీ వారికి ఎలాంటి హాని జరగలేదు. కాల్పులు జరిపిన వెంటనే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ హత్య వెనుక ఉన్న కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. హంతకుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శ్రీలంకలో దారుణం: కార్యాలయంలోనే మున్సిపల్ ఛైర్మన్ హత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES