Sunday, April 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి అమానుషం

గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడి అమానుషం

- Advertisement -
  • ఇందిరమ్మ రాజ్యమా…. రేవంత్ రెడ్డి గూండా రాజ్యమా
    -దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
    -హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్
    నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ కెసిఆర్ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం అమానుషమైన చర్య అని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ శనివారం  ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, మాజీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసి ఫర్నిచర్ల ధ్వంసం చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నియంత ధోరణికి నిదర్శనంగా కనిపిస్తోందన్నారు.
  • తమది ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ రెడ్డి తన గుండా రాజ్యాన్ని నడిపిస్తున్నాడని విమర్శించారు. గడిచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఒక ప్రతిపక్ష నేత క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం బాధాకరమన్నారు. డిసిసి అధ్యక్షురాలి హోదాలో ఉండి కూడా కాంగ్రెస్ నాయకులను రెచ్చగొట్టి దాడులకు పాల్పడడం ఆంక్ష రెడ్డికి తగదన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని రేవంత్ రెడ్డి ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యేల క్యాంపు ఆఫీసుల పైకి కార్యకర్తలను ఉసిగొల్పడం ఆయన గుండా గిరికి నిదర్శనం అన్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగబోయే ప్రజా ఉద్యమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -