Sunday, September 14, 2025
E-PAPER
Homeజాతీయంభారత్‌పై సుంకాల దాడి చేయండి..!

భారత్‌పై సుంకాల దాడి చేయండి..!

- Advertisement -

చైనాపై కూడా వేయండి
యూరప్‌ దేశాలపై అమెరికా ఒత్తిడి
రష్యా చమురు కొనుగోలు సాకు


న్యూఢిల్లీ : రష్యన్‌ చమురు కొనుగోలు చేసే దేశాలపై అధిక సుంకాలను తప్పనిసరిగా విధించాలని గ్రూప్‌ ఆఫ్‌ సెవెన్‌ (జి7) భాగస్వాములపై అమెరికా ఒత్తిడి చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి భారత్‌, చైనా ప్రధాన సహాయకులుగా నిలుస్తున్నాయని పేర్కొంది. శుక్రవారం జి7 ఆర్థిక మంత్రులతో వర్చ్యువల్‌ మీటింగ్‌లో యుఎస్‌ ట్రెజరీ కార్యదర్శి స్కాట్‌ బెసెంట్‌, వాణిజ్య ప్రతినిధి జామిసన్‌ గ్రీర్‌లు పాల్గొన్నారు. వాషింగ్టన్‌ సుంకాల నిర్ణయాలకు అనుగుణంగా మెలగాలని యూరప్‌, ఇతర దేశాలపై వారు ఒత్తిడి చేశారు. రష్యా ఇంధన ఆదాయాలను తగ్గించడమనేది ట్రంప్‌, యుఎస్‌ లక్ష్యమన్నారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు రష్యాపై ఒత్తిడి తేవడమే సరైన మార్గమన్నారు. ఈ క్రమంలో ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌, చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని జామిసన్‌ గ్రీర్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇందుకోసం యూరోపియన్‌ యూనియన్‌, జి7 దేశాలు భారత్‌, చైనాపై అదనపు టారిఫ్‌లను విధించాలని ప్రతిపాదించారు. ఇందుకు జి7 సభ్య దేశాలు కూడా సానుకూలంగా స్పందించాయని సమాచారం.

ఉక్రెయిన్‌ యుద్ధం ముగించడానికి నిజంగా కట్టుబడి ఉంటే.. రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు ముందుకురావాలని స్కాట్‌ బెసెంట్‌ సూచించారు. ఇప్పటికే భారత దిగుమతులపై అమెరికా అధికంగా 50 శాతం సుంకాలు విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యుద్ధం ముగింపునకు కట్టుబడి ఉన్నామంటూ జి7 సభ్యదేశాలు అమెరికాకు హామీ ఇచ్చాయన్నారు. ఈ క్లిష్ట సమయంలో అమెరికాతో కలిసి ఇయు దేశాలు కూడా నిర్ణయాత్మక చర్యలు చేపడుతాయని ఆశిస్తున్నామని గ్రీర్‌ పేర్కొన్నారు. యుఎస్‌ సూచనల మేరకు భారత్‌, చైనాలపై ఇయు అదనపు సుంకాల విధించవచ్చని రిపోర్టులు వస్తోన్నాయి. జి7లో అమెరికా, కెనడా, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, బ్రిటన్‌లతో కూడిన ధనిక, పారిశ్రామిక దేశాలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -