Tuesday, March 17, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాపై మళ్లీ దాడి

గాజాపై మళ్లీ దాడి

- Advertisement -

– 12 మంది మృతి..
– వీరిలో ఇద్దరు చిన్నారులు, ఒక గర్భిణీ
– కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా.. తీరు మారని ఇజ్రాయిల్‌
గాజా :
యుద్ధంతో నాశనమైన గాజా ప్రాంతంలో ఇజ్రాయిల్‌ మళ్లీ దాడులకు తెగబడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ మరీ అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంటోంది. తాజాగా ఇజ్రాయిల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 12 మంది పాలస్తీనీయులు మృతి చెందినట్టు గాజాలోని ఆస్పత్రి అధికారులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక గర్భిణీ, ఎనిమిది మంది పోలీసు అధికారులు ఉన్నారని సమాచారం.
ఆదివారం ఉదయం గాజాలోని నుసేరత్‌ శరణార్థి శిబిర ప్రాంతంలో ఉన్న ఒక ఇంటిపై ఇజ్రాయిల్‌ వైమానిక దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు దంపతులు, వారి పదేండ్ల కుమారుడు మృతి చెందారు. గర్భిణీగా ఉన్న ఆ మహిళకు కవలలు జన్మించనున్న తరుణంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని అల్‌-అక్సా ఆస్పత్రి అధికారులు తెలిపారు. ఇదే ఘటనలో మరొక బాలుడు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఇక మరోదాడిలో సెంట్రల్‌ గాజాలోని జవైదా పట్టణం వద్ద పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని బాంబుదాడి జరిగింది. ఈ దాడిలో ఎనిమిది మంది పోలీసు అధికారులు మృతి చెందారు. 14 మంది గాయపడ్డారు.
ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య యుద్ధాన్ని నిలిపివేయడానికి కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ… ఇజ్రాయిల్‌ దానిని తరచూ ఉల్లంఘిస్తోంది. అమయాక ప్రజలు, భద్రతా దళాల ప్రాణాలు తీస్తోంది. గాజా ఆరోగ్య శాఖ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 72వేల మందికి పైగా పాలస్తీనీయులు మరణించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -