Tuesday, March 10, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకుమ్మెర గ్రామంలో పసిపాపపై దాడి అమానుషం

కుమ్మెర గ్రామంలో పసిపాపపై దాడి అమానుషం

- Advertisement -

– కుల దురహంకార దాడులను ఖండించండి
– పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట నిరసన
నవతెలంగాణ- మెదక్‌ ప్రాంతీయ ప్రతినిధి/విలేకరులు

ప్రపంచంలో ఎక్కడా లేని దుర్మార్గమైన కుల వ్యవస్థ మన దేశంలోనే ఉన్నదని, కుమ్మెర గ్రామంలో పసిపాపపై దాడి చేసి చంపివేయడం అమానుషమని సీఐటీయూ నాయకులు అన్నారు. నాగర్‌కర్నూల్‌లో పసిపాపపై దాడికి పాల్పడి ఆమె మరణానికి కారణమైన వారిపై అట్రాసిటీ కేసు, హత్యానేరం కేసు పెట్టి వారిని అరెస్ట్‌ చేయాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మల్లేశం మాట్లాడారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో పురోభివృద్ధి సాధిస్తున్నప్పటికీ సాటి మనిషిని, మనిషిలాగా చూడలేని దుర్మర్గపు స్థితి దేశంలో నేటికీ కొనసాగడం అమానుషమని అన్నారు. సామాజిక అణిచివేత, దాడులు, వివక్ష, దోపిడీలకు వ్యతిరేకంగా సమానత్వం-కుల రహిత సమాజం కోసం కార్మికవర్గం సమరశీల పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. పసిపాప మరణానికి కారణమైన వారిపై కేసు పెట్టి, అరెస్ట్‌ చేసి శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు, జిల్లా సహాయ కార్యదర్శి ఎం యాదగిరి, నాయకులు పాల్గొన్నారు. వికారాబాద్‌ జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం సీఐటీయూ జిల్లా కార్యదర్శి కే.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. నల్లగొండలో సీఐటీయూ జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -