Saturday, February 28, 2026
E-PAPER
Homeజాతీయంఇరాన్ పై దాడి అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడమే: సీపీఐ(ఎం)

ఇరాన్ పై దాడి అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించడమే: సీపీఐ(ఎం)

- Advertisement -

నవతెలంగాణ – న్యూఢిల్లీ: ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేసిన దాడులను సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు ఇరాన్ సార్వభౌమత్వాన్ని, ఐక్యరాజ్యసమితి చార్టర్ ను, అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించాయి. ఇరాన్ తో జరుగుతున్న చర్చలను పట్టించుకోకుండా అమెరికా, ఇజ్రాయిల్ ఈ దాడులను నిర్వహించాయి. ఈ చర్చలను తాము ఎప్పుడూ నమ్మలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడులు, ప్రకటనల ద్వారా స్పష్టమవుతోంది. వెనిజులాపై దాడి, క్యూబాపై బెదిరింపుల తర్వాత ఇరాన్ పై ఈ దాడి జరిగిందన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయిల్ పర్యటన ముగించిన వెంటనే ఇరాన్ పై దాడి జరిగింది. మిత్ర దేశమైన ఇరాన్ పై జరిగిన దాడులను భారత ప్రభుత్వం బేషరతుగా ఖండించాలని కూడా సీపీఐ(ఎం) ప్రకటన డిమాండ్ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -