– కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ
నవతెలంగాణ – కామారెడ్డి
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై దాడి కి నిరసన గా సోమవారం కలెక్టరేట్ ఎదుట నల్ల జెండాలతోఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ముట్టడి, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ గారిపై జరిగిన దాడి, న్యాయ వ్యవస్థ పైనా దాడి అని కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడి,న్యాయ వ్యవస్థ పై భారతరాజ్యాంగం, ప్రజాస్వామ్యం, యావత్తు దళిత సమాజం పై జరిగిన తీవ్రమైన దాడి అని, ఈసంఘటనపై లో వ్యక్తి మాత్రమే కాకుండా దీని వెనుక ఉన్న శక్తులనువెలికి తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉన్నదని అన్నారు.
ఈకార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు కొత్తోల్ల యాదగిరి మాదిగ, ఎమ్మార్పీఎస్ మహిళ విభాగం అధ్యక్షురాలు సత్తి గారి లక్ష్మి, కొత్తూరు సాయిలు, గాంధారి గంగన్న, డాకయ్య , మండల నాయకులు కర్రోల్ల నాగరాజు,నర్సగల్ల బాపు కర్రోల్ల ప్రదీప్ రమేష్ బాలనర్సు పుల్లూరి రాకేష్ మైలారం బాను ,సందీప్, రజినీ కాంత్, రవితేజ,లలిత, లక్ష్మి , ప్రమీల, సుగుణ, పోషవ్వ తదితరులు పాల్గొన్నారు.