దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి
నవతెలంగాణ – కంఠేశ్వర్
రెండు రోజుల క్రితం అత్యున్నత ప్రధాన న్యాయమూర్తి పై దాడి చేయడాన్ని తాము తీవ్రంగా మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బంగారు సాయిలు పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.ఆర్ గవాయిపై బూటుతో తో దాడి జరిపిన మతోన్మాది రాకేష్ కిషోర్ ని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
అలాగే బిజెపి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఈ సంఘటనను మొదట ఖండించాలని దళిత సోషల్ వర్కర్, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బంగారు సాయిలు డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బి. ఆర్గవాయి పై దాడి జరిపిన అతనిపై న్యాయవాది యొక్క ప్రవర్తనను మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు సుంకరిమోహన్ నిరసన తెలిపారు. న్యాయమూర్తి పై అది అత్యున్నత న్యాయస్థానంలో జడ్జిపై దాడి జరిపిన ఆ వ్యక్తిని కేంద్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించి మరల ఎవరు ఇలాంటి ఘటనకు పాల్పడకుండా చూసేలా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కోరారు. కార్యక్రమంలో మైనార్టీ నాయకులు హుస్సేన్, కేష్ పల్లి రవి, మేకల అశోక్, మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు సోనీ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడి దుర్మార్గపు చర్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES