- Advertisement -
– ఎమ్మార్పీఎస్ మాచారెడ్డి మండల అధ్యక్షుడు
నవతెలంగాణ – కామారెడ్డి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గారి పై దాడి చేయడం సిగ్గుచేటని మాచారెడ్డి మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు బట్ట రమేష్ అన్నారు. బుధవారం మాచారెడ్డి మండలంలోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓక సీనియర్ అడ్వాకెట్ దాడికి యత్నిచటం సిగ్గు చేటనీ, ఇలాంటి దాడి భారత రాజ్యాంగంపై నా జరిగినటువంటి దాడిగా అభివర్ణించడం జరిగిందన్నారు. ఇలాంటి వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు జాన్ , మధు, సంతోష్, మనోహర్, కర్నాకర్, మహేష్, కాశాయ్య తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -