Sunday, February 22, 2026
E-PAPER
Homeజాతీయందేశ సార్వభౌమాధికారంపై దాడి

దేశ సార్వభౌమాధికారంపై దాడి

- Advertisement -

వాణిజ్య ఒప్పందంపై ప్రకాశ్‌కరత్‌ విమర్శ
ఎర్నాకుళం : భారత ప్రభుత్వం ఇటీవల అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం భారతదేశ సార్వభౌమాధికారంపై దాడి అని సీపీఐ(ఎం) సీనియర్‌ నేత ప్రకాశ్‌కరత్‌ విమర్శించారు. ఈ ఒప్పందం ద్వారా తన సామ్రాజ్యవాద, కార్పొరేట్‌ ప్రయోజనాలను ట్రంప్‌ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోందని తెలిపారు. ఎర్నాకుళంలోని ఇఎంఎస్‌ పరిశోధనా, అధ్యయనాల కేంద్రంలో నిర్వహించిన సెమినార్‌లో ఆయన పాల్గొని ఈ ఒప్పంద పర్యవసానాలు, ప్రభావాలపై ప్రసంగించారు. ఈ వాణిజ్య ఒప్పందంతో అమెరికా ఉత్పత్తులు పెద్దఎత్తున భారతీయ మార్కెట్‌లోకి వచ్చిపడతాయని, ఫలితంగా దేశీయ ఉత్పత్తులు పక్కకు నెట్టివేయబడతాయని అన్నారు. తద్వారా స్థానిక పరిశ్రమలు తీవ్రంగా దెబ్బ తింటాయని తెలిపారు. దేశ ఆర్థిక స్వేచ్ఛ కూడా ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సెంటర్‌ ఛైర్‌పర్సన్‌, సీపీఐ(ఎం) ఎర్నాకుళం జిల్లా కార్యదర్శి ఎస్‌.సతీష్‌ అధ్యక్షతన ఈ సెమినార్‌ను నిర్వహించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -