Tuesday, January 20, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఖమేనీపై దాడి అంటే యుద్ధమే

ఖమేనీపై దాడి అంటే యుద్ధమే

- Advertisement -

అమెరికాకు ఇరాన్‌ అధ్యక్షుడి వార్నింగ్‌
ఇరాన్‌లో సంక్షోభానికి అమెరికా, దాని మిత్రదేశాల ఆంక్షలే ప్రధాన కారణం
నిర్బంధంలో ఉన్నవారికి ఉరిశిక్ష అంశంలో ముందుకెళ్తాం : ఇరాన్‌ న్యాయశాఖ


టెహ్రాన్‌ : ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీపై దాడి చేస్తే అది పూర్తి స్థాయి యుద్ధానికి దారి తీస్తుందని అమెరికాకు ఆ దేశ అధ్యక్షుడు మసౌద్‌ పెజెష్కియాన్‌ హెచ్చరించారు. ఇరాన్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు అమెరికా, దాని మిత్రదేశాలు విధించిన అమానుష ఆంక్షలే ప్రధాన కారణమని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ఇరాన్‌లో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని చెప్పిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

‘ఇరాన్‌ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రధాన కారణం అమెరికా, దాని మిత్రదేశాలు సంవత్సరాలుగా విధిస్తున్న ఆర్థిక ఆంక్షలే కారణం. మన దేశ సుప్రీం లీడర్‌పై ఎలాంటి దాడి జరిగినా అది ఇరాన్‌ దేశంపై యుద్ధం ప్రకటించినట్టే. దీనిని మేము సహించబోం’ అని పెజెష్కియాన్‌ స్పష్టం చేశారు. మరోవైపు నిర్బంధంలో ఉన్నవారికి ఉరిశిక్ష విధించే అంశంలో ముందుకెళుతామని ఇరాన్‌ న్యాయశాఖ అధికారి ప్రతినిధి తెలిపారు. కొన్ని కేసులను మోహరబ్‌ కింద నమోదు చేశామని వాటి విషయంలో చట్టం ప్రకారం నడుచుకుంటామని అన్నారు. ఇరాన్‌ చట్టంలో మోహరబ్‌ను దేవునిపై యుద్ధంగా పేర్కొన్నారు. మోహరబ్‌ కింద కేసు నమోదైతే ఇరాన్‌ చట్టం ప్రకారం ఉరిశిక్ష విధిస్తారని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -