Thursday, July 17, 2025
E-PAPER
Homeఆదిలాబాద్తీన్మార్ మల్లన్నపై దాడి చేయడం అమానుషం..               ...

తీన్మార్ మల్లన్నపై దాడి చేయడం అమానుషం..                           

- Advertisement -

ముధోల్ లో బీసీ ఐక్యచరణకమిటి  నిరసన 
నవతెలంగాణ – ముధోల్
: తీన్మార్ మల్లన్న పై దాడి చేయడం అమానుషమని బీసీ ఐక్య కార్యాచరణకమిటీ సభ్యులు పేర్కొన్నారు. నియోజకవర్గకేంద్రమైన ముధోల్ లోని న్యూ బస్టాండ్ సమీపన రోడ్డుపై బుధవారం  నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్న పై, కార్యాలయం పైఅన్యాయంగా దాడి చేశారని వారు పేర్కొన్నారు. బీసీలపై ప్రతిరోజు ఏదో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయని ఆరోపించారు. ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నపై దాడిచేయడం అవివేకమని వారు అన్నారు.

ఎవరైనా తప్పు చేస్తే న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా,చట్టపరమైన చర్యలకు వెళ్లాలి కానీ, చట్టాన్ని చేతుల తీసుకోవడం, దౌర్జన్యం చేయడం సబాబు కాదని అన్నారు. ఎమ్మెల్సీ కవిత బీసీ బిడ్డలపై, దౌర్జన్యంగా  దాడులు చేస్తే తగిన గుణ పాఠం చెబుతామని వారు హెచ్చరించారు. నిత్యం ప్రజా సమస్యలపై స్పందించే సీనియర్ జర్నలిస్టు తీన్మార్ మల్లన్నను దాడులతో భయపెట్టి, గొంతు నొక్కాలని చూస్తున్నారని వారు పేర్కొన్నారు. భావప్రకటనా స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముధోల్ తాలుకా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు రోళ్ల రమేష్ ,న్యాయవాది జుట్టు గజేందర్, మాజీ సర్పంచ్ అనిల్, మండల బిజెపి అధ్యక్షులు కోరి పోతన్న ,నాయకులు ధర్మపురి శ్రీనివాస్, టి .రమేష్ ,సుభాష్ , జీవన్ద,దశరథ్, విట్టల్,లవన్ కుమార్,  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -