– ప్రజా రాజ్యం అని చెప్పి రౌడీల కు ప్రోత్సాహం
– మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి
నవతెలంగాణ – అశ్వారావుపేట
బీఆర్ఎస్ మణుగూరు నియోజకవర్గ కేంద్ర కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని బీఆర్ఎస్ నాయకులు, అశ్వారావుపేట మాజీ ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి తీవ్రంగా ఖండించారు. ఆయన ఆదివారం స్పందిస్తూ, “కాంగ్రెస్ పార్టీ ప్రజా రాజ్యం పేరుతో రౌడీల కు ప్రోత్సాహం ఇస్తోంది అని,తప్పులను ఎత్తి చూపితే సరిదిద్దుకోవటం బదులు దాడులకు దిగుతోంది,” అని వ్యాఖ్యానించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు స్థానికంగా అందుబాటులో లేని సమయంలో కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.
అధికారులు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని, దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
మణుగూరు పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ ఆక్రమించాలని పధకం ప్రకారం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.



