Wednesday, February 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమోడీ పాలనలో దళితులపై దాడులు తీవ్రం

మోడీ పాలనలో దళితులపై దాడులు తీవ్రం

- Advertisement -

– సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాల నరసింహ
– 26,27 తేదీల్లో వరంగల్‌లో డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర మహాసభలు : ఎం. అనిల్‌కుమార్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

మోడీ పాలనలో దళితులపై దాడులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయనీ, బీజేపీ దళిత వ్యతిరేక విధానాలను దళిత సమాజం సరిగా అర్థం చేసుకొని సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం. బాలనరసింహ పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కె.యేసురత్నం అధ్యక్షతన ఆ సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బాలనర్సింహ మాట్లాడుతూ..రాజ్యాంగంలోని సామాజిక న్యాయ భావనలను పక్కన పెట్టి, కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా ఎన్‌డీఏ సర్కారు పాలన సాగిస్తోందని విమర్శించారు. దేశంలో 20 కోట్లకు పైగా దళిత జనాభా ఉండగా ఆదిశగా బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల్లేవని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తూ రిజర్వేషన్లను నిర్వీర్యం చేస్తున్నదనీ, దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిని జైళ్ల నుంచి భారత్‌మాతాకీ జై అంటూ స్వాగతం పలకడం దుర్మార్గమని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో దళితులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. 2018 నుంచి ఎస్సీలకు తక్షణమే సబ్సిడీ రుణాలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర రెండో మహాసభలు ఏప్రిల్‌ 26 27వ తేదీల్లో వరంగల్‌లో నిర్వహించనున్నట్టు ప్రకటించారు. సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర నాయకులు కె రత్నకుమారి, వై ఉషశ్రీ, టి రామకృష్ణ, కే వెంకటస్వామి, ఆరుట్ల రాజ్‌ కుమార్‌, జేరుపోతుల కుమార్‌, బి లక్ష్మిపతి, యం సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -