ముగ్గురిపై కేసు
నవతెలంగాణ – మల్హర్ రావు
గుడుంబా నిర్మూలన ప్రత్యేక డ్రైవ్ లో భాగంగా ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ జి.అంజన్ రావు,వరంగల్ జిల్లా ప్రొహిబిషన్ వి.శ్రీనివాస్, భూపాలపల్లి జిల్లా అధికారి ఆదేశాల మేరకు కాటారం, భూపాలపల్లి డివిజన్ల సంయుక్తంగా శుక్రవారం మహాముత్తారం మండలంలోని పెగడపల్లి, ప్రేమ్ నగర్ గ్రామాల్లో నాటు సారాయి తయారీ స్థావారాలపై విస్తృతంగా దాడులు నిర్వహించినట్లుగా ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ముగ్గురిపై నమోదుచేసి,ఇద్దరూ నిందితులను అరెస్ట్ చేసి, 15 లీటర్ల నాటుసాయిరా, 20కిలోల చక్కర, 2 కేజీలు డ్రై ఈస్ట్ పౌడరును స్వాధీనపరుచుకొని, 900 లీటర్ల చక్కర పానకాన్నీ ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు. నాటు సారాయిని తయారు చేసిన, రవాణా చేసిన, విక్రయాలు చెసిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాటారం సిఐ బాదావత్ కిష్టయ్య,ఎస్ఐ షేక్ రబ్బానీ,వెంకట రాజు,కోటేశ్వర్,విమల,మహేష్,షౌకత్ అలీ పాల్గొన్నారు.
గుడుంబా స్థావరాలపై దాడులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



