– బరితెగిస్తున్న అమెరికా, ఇజ్రాయిల్
– తొమ్మిదో రోజుకు యుద్ధం
టెహ్రాన్ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ భారీ స్థాయిలో తమ దాడుల్ని కొనసాగిస్తునే ఉన్నాయి. అయితే ఈ దాడుల్లో తొలిసారిగా ఇరాన్ ఆయిల్ స్టోరేజ్ డిపోలు, రిఫైనింగ్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌ను కారుమేఘాలు కమ్మేశాయి. ఆదివారంతో అమెరికా, ఇజ్రాయిల్ దాడులు తొమ్మిదో రోజుకు చేరుకోగా శనివారం అర్థరాత్రి నుంచే ఇరాన్ ఆయిల్ డిపోలపై అమెరికా, ఇజ్రాయిల్ దాడులకు పాల్పడ్డాయి. ముందుగా టెహ్రాన్‌కు సమీపంలో ఉన్న షేహ్రాన్ ఆయిల్ డిపోపై దాడులు జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. తరువాత మొత్తంగా మూడు డిపోలపై దాడులు జరిగినట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వీడియోలను కూడా విడుదల చేసింది. ఇరాన్ ఆయిల్ డిపోలపై దాడులు చేసినట్టు ఇజ్రాయిల్ కూడా ప్రకటించింది. ఇరాన్ సైన్యానికి ఇక్కడ్నుంచే ఆయుల్ సరఫరా అవుతుందని, సైనిక మౌలిక వసతులను దెబ్బతీయడానికే ఆయిల్ డిపోలపై దాడులు చేసినట్లు తెలిపింది.
ఇరాన్ చమురు నిల్వలపై దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



