Sunday, March 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా స్థావరాలపై దాడులు..భారీ ప్రాణనష్టం: ఇరాన్ ప్రకటన

అమెరికా స్థావరాలపై దాడులు..భారీ ప్రాణనష్టం: ఇరాన్ ప్రకటన

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : దుబాయ్‌లోని రెండు రహస్య అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి, డ్రోన్లతో దాడులు చేసి భారీ నష్టాన్ని కలిగించామని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఈ దాడుల్లో అమెరికాకు తీవ్ర ప్రాణనష్టం వాటిల్లిందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది.

దుబాయ్‌లో ఉన్న రెండు రహస్య అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు నిర్వహించామని, ఒక స్థావరంలో 400 మంది, మరో స్థావరంలో 100 మంది సైనికులు ఉన్నారని, మొత్తం 500 మంది ఉన్న ఈ స్థావరాలపై కచ్చితత్వంతో క్షిపణులను ప్రయోగించామని ఐఆర్‌జీసీ పేర్కొంది. ఈ దాడుల్లో గాయపడిన అమెరికన్లను తరలించేందుకు దుబాయ్‌లోని అంబులెన్సులు గంటల తరబడి పనిచేశాయని ఇరాన్ మీడియా తెలిపింది.

ఈ ప్రాంతంలో అమెరికా సైనికులకు తీవ్ర ప్రాణనష్టం తప్పదనే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్‌, అక్కడి సైనిక కమాండర్లు అర్థం చేసుకుంటారని ఓ ఐఆర్‌జీసీ కమాండర్ హెచ్చరించారు. వారు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ గల్ఫ్ దేశాలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అమెరికా, ఇజ్రాయెల్‌లకు మద్దతు ఇవ్వవద్దని ఆయన సూచించారు. గల్ఫ్ దేశాల్లో శాంతి, అభివృద్ధి నెలకొనాలంటే తాము చెప్పినట్లు నడుచుకోవాలని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -