Tuesday, October 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సిజెఐపై దాడికి యత్నం దుర్మార్గపు చర్య.!

సిజెఐపై దాడికి యత్నం దుర్మార్గపు చర్య.!

- Advertisement -

సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు..లింగమల్ల జ్యోతి-శంకర్ దంపతులు
నవతెలంగాణ – మల్హర్ రావు

సిజేఐపై మతోన్మాద న్యాయవాది షుతో దాడికి యత్నం చేయడం దుర్మార్గపు చర్యని ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షురాలు లింగమల్ల జ్యోతి-శంకర్ దంపతులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం మండలంలోని కొయ్యుర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు బిజెపి మనువాద పాలనలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రక్షణ లేకపోతే ఇక సామాన్య దళితులకు రక్షణ ఎక్కడ పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పై న్యాయవాది ముసుగు వేసుకున్న ఒక సనాతనవాది కోర్టు హాలులో న్యాయవాదులందరూ చూస్తుండగా షూ తో దాడికి ప్రయత్నించడం అత్యంత హేయమైన,దుర్మార్గమైన చర్యన్నారు.

స్వతంత్ర న్యాయ వ్యవస్థ మీద దాడి మాత్రమే కాదు, మన భారత రాజ్యాంగంపై దాడి కూడా. మనుస్మృతిని తమ రాజ్యాంగంగా కొనసాగిస్తున్న బిజెపి,ఆర్ఎస్ఎస్, వాటి అనుబంధ సంస్థలకు భారత రాజ్యాంగమును గౌరవించడం, అమలు చేయడం సుతారము ఇష్టం లేదనే విషయం ఈ చర్యతో మరొక్కసారి రుజువు అయిందన్నారు.గతంలో నూతన పార్లమెంటు భవనం ప్రారంభ ఉత్సవంలో భారత ప్రథమ పౌరురాలు శ్రీమతి ద్రౌపతి ముర్మును పక్కకు పెట్టడానికి ఆమె ఒక భర్త లేని స్త్రీ అని, ఆదివాసి మహిళ అని, సనాతన మనుధర్మం ప్రకారం ఆ శుభకార్యానికి ఆమెకు అనుమతి లేదని భారతదేశానికే కాదు, ప్రపంచానికి చాటి చెప్పిన విషయం మనందరికీ తెలుసున్నారు.

ఈ రెండు విషయాలతో దళితులు, ఆదివాసీలు అత్యున్నత పదవులలో ఉన్నా వారిని ఈ బిజెపి ఆర్ఎస్ఎస్ శక్తులు మనుషులుగా, పౌరులుగా చూడవని,గౌరవించవని పై రెండు సంధర్భాలలో మనకు స్పష్టమయిందన్నారు.కావున బీజేపీ మనువాద సనాతన వాద దుష్ట శక్తులను ప్రజలు,ప్రజాస్వామికవాదులు ఇప్పటికైనా ఎదుర్కోకపోతే ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి, భారతదేశ ప్రజలకు భవిష్యత్తు ఉండదని మనకు తేటతెల్లమయిందన్నారు.ఈ కార్యక్రమంలో సొసైటీ జాతీయ కార్యవర్గ సభ్యులు బండి రాజయ్య,రావుల మొగిలి,కాళేశ్వరం జోనల్ అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్,ఉపాధ్యక్షుడు బండి సుధాకర్,మండల కాటారం సబ్ డివిజన్ మహిళ అధ్యక్షురాలు కొండూరి మమత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -