– కోవాబన్ వ్యాపారిని లక్ష్యంగా చేసుకోవడాన్ని ఖండిస్తున్నాం
– ఆ యూట్యూబర్లపై చర్యలు తీసుకోవాలి : ఏఐవైఎఫ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మేడారం జాతరలో కోవాబన్ వ్యాపారి షేక్ జావెద్ అలీని లక్ష్యంగా చేసుకుని ‘ఫుడ్ జిహాద్’ అంటూ మత విద్వేషాలను రెచ్చగొట్టే యత్నం చేసిన యూట్యూబర్ల గుంపుపై రాష్ట్ర ప్రభుత్వం చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ వలిఉల్లాఖాద్రి డిమాండ్ చేశారు. అలీపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ముస్లింలపై జరుగుతున్న విద్వేష ప్రచారాలను తక్షణం ఆపాలని కోరారు. లౌకిక విలువలను కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
మన దేశ ప్రజాస్వామ్య, లౌకిక స్వరూపాన్ని రక్షించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. సమాజంలో ప్రజల మధ్య ఐక్యత, సమానత్వాన్ని కాపాడేందుకు ప్రజలంతా ఏకమై పనిచేయాలని పిలుపునిచ్చారు. మతం పేరుతో చిన్న వ్యాపారులు, కూలీలను లక్ష్యంగా చేసుకోవడం అమానుషమనీ, ఇది సామాజిక శాంతి, సామరస్యానికి ముప్పు అని హెచ్చరించారు. రాజ్యాంగ విలువలను కాపాడేందుకు, ప్రతి పౌరుడి గౌరవం, భద్రత, సమాన హక్కుల కోసం అవగాహన కార్యక్రమాలు, ప్రజాస్వామ్య ఆందోళనలు చేస్తామని స్పష్టం చేశారు.
మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు యత్నం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



