నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని 1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తాళం వేసిన షాపులో చోరీకి యత్నం జరిగింది. అయితే ఎలాంటి వస్తువులు దొంగతనం కాలేదని ఎస్హెచ్ఓ రఘుపతి ఆదివారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో ఎన్టీఆర్ చౌరస్తాలోని శ్రీ మోక్ష రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ఆర్కే బిల్డర్స్ షాప్ ఎప్పటిలాగే తన షాపును శనివారం రాత్రి 10:30కు తాళం వేశాడు. మళ్ళీ ఆదివారం ఉదయం 10 గంటలకు ఆఫీసుకు వచ్చి చూసేసరికి తన ఆఫీసు ఆర్కే బిల్డర్స్ యొక్క షట్టర్ తాళాలు పగలగొట్టి ఉన్నది. బాధితుడు లోపలికి వెళ్లి పరిశీలించాడు. ఆఫీసులోని వస్తువులు అన్ని ఇచ్చిన చిందరవందరగా పడి ఉన్నాయి. లాకర్ రాక్స్ తాళాలు పగలగొట్టి తెరిచి ఉన్నాయి. కానీ షాప్ లో ఎటువంటి వస్తువులు కూడా దొంగిలించబడలేదు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
తాళం వేసిన షాపులో చోరీకి యత్నం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES