- Advertisement -
- – యువతి అప్రమత్తమై అతడి దగ్గర్నుంచి తప్పించుకొని పరారీ.
– సమాచారం అందుకొని యువతని స్టేషన్ కు తీసుకువెళ్లిన పోలీసులు.
నవతెలంగాణ – తిమ్మాపూర్
కరీంనగర్ రూరల్ మండలం చింతకుంట సమీపంలోని వడ్డేపల్లికి చెందిన ఓ మైనర్ బాలిక కరీంనగర్లోని ప్రైవేట్ ఒకేషనల్ కళాశాలలో ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నది. అదే గ్రామానికి చెందిన వరుసకు మేనమామ అయ్యే వ్యక్తి కళాశాలలో దింపుతానని అమ్మాయిని బైక్ పై ఎక్కించుకొని హైదరాబాద్ రోడ్డు గుండా ఎల్ఎండి పరిసర ప్రాంతాల్లోకి తీసుకెళ్తుండగా అనుమానం వచ్చి అప్రమత్తమైన అమ్మాయి.. కాకతీయ కెనాల్ పరిసర ప్రాంతాల్లో బైక్ నుండి దూకడంతో బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. దుస్తులు చిరిగిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి అమ్మాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. నిందితునికోసం గాలిస్తున్నట్లు ఎల్ ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
- Advertisement -