– బెట్టింగ్ యాప్ కేసులో
– విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
బెట్టింగ్ యాప్ కేసులో తమ ఎదుట ఆగస్టు 11న విచారణకు హాజరు కావాలని నటుడు విజయ్ దేవరకొండకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించటం ద్వారా హవాలా మార్గంలో పెద్ద ఎత్తున డబ్బులను ఆర్జించారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న సినీ ప్రముఖులలో విజరు దేవరకొండ పేరు కూడా ఈడీ జాబితాలో ఉన్నది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకసారి నోటీసు జారీ చేసిన ఈడీ.. సదరు నటుడి విజ్ఞప్తి మేరకు మరో తేదీని ఖరారు చేస్తూ ఆగస్టు 11న విచారణకు రావాలని కోరింది. మరోవైపు నటుడు ప్రకాశ్‌రాజ్‌ను ఈనెల 30న, నటి మంచు లక్ష్మిని ఆగస్టు 13న విచారణకు రావాలని తెలిపింది.
ఆగస్టు 11న హాజరవ్వండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES