Saturday, September 27, 2025
E-PAPER
Homeఖమ్మంవరుస సెలవులతో పడిపోతున్న హాజరు 

వరుస సెలవులతో పడిపోతున్న హాజరు 

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
వరుస సెలవులు ఆపేవి కావు. విద్యార్ధుల స్వేచ్ఛకు అడ్డూ అదుపు లేదు. దీంతో ప్రాధమిక ఆపసాపాలు పడుతుంది. పాఠశాలలకు తరుచూ వరుస సెలవులతో విద్యార్ధులు హాజరు పడిపోతుంది. గడిచిన వారం శ్రావణ శుక్రవారం, రెండో శనివారం, ఆదివారం వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఈ వారం మొదటి రోజు సోమవారం పాఠశాలల్లో భారీగా హాజరు పడిపోయింది. సోమవారం నవతెలంగాణ ఎంపీయూపీఎస్ ఊట్లపల్లి, ఆసుపాక, నందిపాడు, ఎంపీపీ ఎస్ కుడుములపాడు పాఠశాలలను సందర్శించి ఉంచింది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కిషిందర్ రెడ్డి, విజయలక్ష్మి ఎం.క్రిష్ణా రావు, రాజశేఖర్ లు తెలిపిన వివరాలు..

పాఠశాల        మొత్తం         హాజరు        ఆబ్సెంట్
ఊట్లపల్లి          96              61                35
ఆసుపాక        168             120              48
నందిపాడు       106             70               36
కుడుములపాడు  31           25                06
మొత్తం              401           276            125

నాలుగు పాఠశాలల్లో మొత్తం 401 మంది విద్యార్ధులకు గానూ 276 మంది హాజరు అవగా 125 మంది గైర్హాజర్ అయ్యారు. దీనికి కారణం వరుస సెలవులు అయితే తెల్లారే బడిలో హాజరు శాతం గణనీయంగా పడిపోతుందని ఉపాద్యాయులు వాపోయారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -