Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడి కేంద్రాల నిర్వహణ పట్ల దృష్టి పెట్టాలి 

అంగన్వాడి కేంద్రాల నిర్వహణ పట్ల దృష్టి పెట్టాలి 

- Advertisement -

ఐసిడిఎస్ సూపర్వైజర్ మల్లీశ్వరి 
నవతెలంగాణ-పాలకుర్తి

అంగన్వాడి కేంద్రాల నిర్వహణ పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించి చిన్నారులతో పాటు బాలింతలకు, గర్భిణీ మహిళ లకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించాలని ఐసిడిఎస్ సూపర్వైజర్ బొట్ల మల్లేశ్వరి అంగన్వాడి ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని బమ్మెరలో ఏర్పాటు చేసిన సెక్టార్ సమావేశంలో మల్లీశ్వరి మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కద్రంలో నెలకు సరిపడా పౌష్టికాహారం అందుబాటులో ఉండాలని సూచించారు.

చిన్నారుల బరువు, ఎత్తు, దెబ్బ కొలతలను ఎప్పటికప్పుడు గుర్తించాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి చిన్నారుల వివరాలతో పాటు బాలింతలు గర్భిణీ మహిళల వివరాలను సేకరించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. చిన్నారులతోపాటు బాలింతలకు, గర్భిణీ మహిళలకు పౌష్టికాహారాన్ని అందించి అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా పనిచేసే విధంగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -