లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.1గా ‘ఆకర్షిత’ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శనివారం ఘనంగా జరిగాయి. త్రిగుణ్, పదినే కుమార్ జంటగా నటించనున్నారు. సూరిశెట్టి కిషోర్ దర్శకుడు. కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్ర పూజా కార్యక్రమానికి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, వేణుస్వామి, నిర్మాతలు దామోదర ప్రసాద్, సి.కళ్యాణ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సి.కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి స్క్రిప్ట్ అందజేశారు. బేబీ ఆష్కా, కీర్తన కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నటి ప్రియ చిత్ర టైటిల్ ‘ఆకర్షిత’ను రివీల్ చేశారు.
హీరో త్రిగుణ్ మాట్లాడుతూ,’కొత్త దర్శకుడు కిషోర్ మంచి కథతో సినిమా తీస్తున్నారు’ అని అన్నారు. ‘మా చిత్రం చాలా కొత్తగా ఉంటుంది’ అని దర్శకుడు సూరిశెట్టి కిషోర్ చెప్పారు. నిర్మాత సందీప్ యాదవ్ మాట్లాడుతూ, ‘ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే కథతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం’ అని తెలిపారు. అదుర్స్ రఘు, కసిరెడ్డి రాజ్ కుమార్, సత్యం రాజేష్, రవి వర్మ, బలగం జయరాం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు : కోరే సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు, దర్శకుడు : సూరిశెట్టి కిషోర్, డీఓపీ: షేక్ హజారత్ (వలి), సంగీతం : రోహిత్ బాబు, ఆర్ట్ డైరెక్టర్ : ఎస్.అర్జున్, సాహిత్యం : పూర్ణా చారి, తిరుపతి.
‘ఆకర్షిత’ మొదలైంది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



