Wednesday, April 1, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంనోటీసు గడువులోపు క్లెయిమ్‌ చేసుకోకుంటే వేలం

నోటీసు గడువులోపు క్లెయిమ్‌ చేసుకోకుంటే వేలం

- Advertisement -

– ఆర్టీసీ డిÄపోల్లోని పార్కింగ్‌ వాహనాలపై దృష్టి : రంగారెడ్డి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ సదానందం
నవతెలంగాణ-సిటీబ్యూరో

రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో నిలిపి ఉంచిన వాహనాలతో పార్కింగ్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. దీనిపై దృష్టిసారించిన రవాణాశాఖ అధికారులు.. క్లెయిమ్‌ చేయని వాహనాలను బహిరంగ వేలం వేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా పరిధిలోని ఆర్టీసీ డిపోల్లో సుదీర్ఘ కాలంగా పేరుకుపోయిన వాహనాలకు సంబంధించి యజమానులు లేదా ఫైనాన్షియర్లు సంబంధిత రవాణా అధికారులను సంప్రదించి ఈనెల 20 లోపు ‘రిలీజ్‌ ఆర్డర్స్‌’ పొందాల్సి ఉంటుంది. ఒకవేళ గడువు లోపు ఎవరూ వాహనాలను క్లెయిమ్‌ చేసుకోకపోతే, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే ఆ వాహనాలను బహిరంగ వేలం వేస్తామని రంగారెడ్డి డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ జి.సదానందం స్పష్టం చేశారు.

విస్తృత ప్రచారం కోసం..
అధికసంఖ్యలో వాహనాలు డిపోల్లో ఉండటంతో పార్కింగ్‌ ఇబ్బందులు ఎదు రవుతున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి బహిరంగవేలం తప్పనిసరి అని డీటీసీ తెలిపారు. ఈ విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, వాహన యజమానులు అప్రమత్తమయ్యేలా విస్తృత ప్రచారం చేస్తున్నామని, తక్షణమే స్పందించి వారి వాహనాలను విడుదల చేయించుకోవాలని సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -