Friday, January 9, 2026
E-PAPER
Homeజిల్లాలుచైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ లో వేలంపాట 

చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ లో వేలంపాట 

- Advertisement -

డబ్బులు పెడితేనే టిక్కెట్టు అంటూ హుకుం
వలస వెళ్లిన వారు తిరిగి వస్తే స్వాగతిస్తాం
కాంగ్రెస్ పై నల్లమోతు సంచలన వ్యాఖ్యలు
నవతెలంగాణ – మిర్యాలగూడ 

మిర్యాలగూడ చైర్మన్ పదవి కోసం కాంగ్రెస్ వేలంపాట వేసినట్లు హైదరాబాదులో ప్రచారం జరుగుతుందని బి ఆర్ ఎస్ రాష్ట్ర యువ నాయకుడు నల్లమోతు సిద్ధార్థ ఆరోపించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ వేలం పాటలు పెట్టినట్లు హైదరాబాద్ లో ప్రచారం జరుగుతుందన్నారు.. చైర్మన్ పదవి ఏడు కోట్ల నుంచి 10, 15 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసేందుకు వేలం పాటలు నడుస్తున్నట్లు హైదరాబాద్ లో చర్చ జరుగుతుందని ఆరోపించారు.

ప్రజా పాలనలో ఆరు నెలల క్రితం  యూరియా పక్కదారి పట్టించడంతో మిర్యాలగూడ పేరు రాష్ట్రస్థాయిలో మార్మోగిందన్నారు. కౌన్సిలర్ టికెట్లకు కూడా టేబుల్ మీద డబ్బులు పెడితేనే ఇస్తమంటున్నట్లు ప్రచారం జరుగుతుందనీ, మిర్యాలగూడ పేరును బ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ పార్టీలో ఆ దౌర్భాగ్యం లేదు. మాకు ఉన్న ఆస్తులు అమ్మి అయినా సరే కష్టకాలంలో పార్టీ వెంట ఉన్న కార్యకర్తలను చైర్మన్ గా, కౌన్సిలర్ గా గెలిపించుకునే బాధ్యత భాస్కర్ రావు తీసుకుంటారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీలో పదవులకు వేలం పాటలు లేవు అన్నారు.

పదేళ్లపాటు మిర్యాలగూడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లమోతు భాస్కర్ రావు  వందల కోట్ల రూపాయల నిధులు తెచ్చి అనేక అభివృద్ధి సంక్షేమ పనులు చేశారని గుర్తు చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటును తెచ్చి రాష్ట్రస్థాయిలో మిర్యాలగూడకు మంచి పేరు తెచ్చారన్నారు. అపోహలు మొహమాటలు వీడి మిర్యాలగూడ అభివృద్ధి కోసం కలిసి రావాలి. భాస్కర్ రావు తో కలిసి పని చేసేందుకు ముందుకు వచ్చేవాళ్ళతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నారు. ఇప్పుడు ఈ పోస్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -