Saturday, January 24, 2026
E-PAPER
Homeనిజామాబాద్అద్దె రూమ్ లకు వేలం - పంచాయతీకి భారీగా ఆదాయం

అద్దె రూమ్ లకు వేలం – పంచాయతీకి భారీగా ఆదాయం

- Advertisement -

కొత్త పాలకవర్గం పట్ల గ్రామస్థులు హర్షం

నవతెలంగాణ- దర్పల్లి

మండల కేంద్రములోని అంగడి బజార్లో ఉన్న పంచాయతీకి సంబందించిన 6 మాడిగేలను శనివారం గ్రామస్థులకు ఆధ్వర్యంలో మండల పంచాయతీ అధికారి రాజేష్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం వేశారు. గ్రామస్థులు ఆ షాపులకు దక్కించుకునేందుకు భారీగానే వేలం వేసి తమకు కావలసిన దుకాణాలకు దక్కించుకున్నారు. ఇంతటి అద్దె మండలంలో ఎన్నడూ ఊహించని విధంగా పంచాయతికి ఆదాయం రాబట్టిన కొత్త పాలక వర్గం నిర్ణయంపై గ్రామస్థులు హర్షం వెక్తం చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా ఇట్టి షాపులకు నామమాత్రపు అద్దె వచ్చేదని, ఇంటమట్టుకు ఈ షాపు లకు ఎవ్వరు పట్టించుకోలేదని, కొత్త సర్పంచ్ ప్రత్యేక దృష్టితో, ప్రత్యేక ఆలోచనతో పంచాయతికి ఆదాయ మార్గం తెచ్చినందుకు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థులకు సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని, వేలంలో పాల్గొన్న గ్రామస్తులకు అయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమములో మండల కాంగ్రేస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, వార్డు సభ్యులు, వ్యాపారస్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -